పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-361-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండిననేకులతో నా
ఖంలుఁ డెదు రయిన గెలిచి ఖాండవవనముం
జండార్చికి నర్పించిన
గాండీవము నిచ్చెఁ జక్రి లుగుట నధిపా!

టీకా:

దండిన్ = దండకారణ్యములో; అనేకుల = అనేకమంది; తోన్ = తో; ఆఖండలుఁడు = ఇంద్రుడు {ఆఖండలుడు - పర్వతములను ఖండించినవాడు, ఇంద్రుడు}; ఎదురయిన = ఎదుర్కొనినను; గెలిచి = గెలిచి; ఖాండవమున్ = ఖాండవ వనమును; చండార్చి = భయంకరమైన అగ్ని, అగ్నిదేవుని; కిన్ = కి; అర్పించిన = సమర్పించిన; గాండీవమున్ = గాండీవమును; ఇచ్చెన్ = ఇచ్చెను; చక్రి = చక్రాయుధుడు, కృష్ణుడు; కలుగుట = ఉండుట వలననే; అధిపా = గొప్పవాడా.

భావము:

గండర గండడై, అమర సమూహంతో ఆఖండలుడు ఎదురై నిల్చినా, గెల్చి ఖాండవవనాన్ని అగ్నిదేవునికి అర్పించి, గాండీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువ వల్లనే కదా.