పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-360-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంకులు నృపులుసూడఁగ,
మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్
గెంటించి మనము వాలుం
గంటిం జేకొంటి మతని రుణన కాదే?

టీకా:

కంటకులు = శత్రువులు {కంటకులు - ముండ్లవంటి వారు, క్షుద్ర శత్రువులు}; నృపులున్ = రాజులు {నృపుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}; చూడఁగ = చూస్తుండగా; మింటన్ = పైన ఆకాశములో; కంపించు = కదులుతున్న; యంత్ర = (మత్య) యంత్రమందు ఉన్న; మీనమున్ = చేపను; కోలన్ = బాణముతో; గెంటించి = పడగొట్టి; మనము = మనము; వాలుంగంటిన్ = ద్రౌపదిని {వాలుగంటి - వాలుచూపులు ఉన్నది, స్త్రీ (ద్రౌపది)}; చేకొంటిమి = వివాహమాడితిమి; అతని = అతని యొక్క; కరుణన = దయవలననే; కాదే = కదా.

భావము:

శత్రురాజు లందరూ కళ్లు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వల్లనే కదా!