పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-358-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికినం గన్నీరు కరతలంబునం దుడిచికొనుచు గద్గదస్వరంబున మహానిధిం గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులు నిగిడించుచు నర్జునుం డన్న కిట్లనియె.

టీకా:

అని = అని; పలికినన్ = పలుకగా; కన్నీరు = కన్నీరు; కరతలంబునన్ = అరచేతితో; తుడిచికొనుచు = తుడుచుకొనుచు; గద్గద = గద్గదమైన; స్వరంబున = స్వరముతో; మహా = గొప్ప; నిధిన్ = నిధిని, ధనరాశిని; కోలుపోయిన = పోగొట్టుకొన్న; పేద = పేదవాని; చందంబునన్ = వలె; నిట్టూర్పులు = నిట్టూర్పులు {నిట్టూర్పు - నిడు (దీర్ఘమైన) ఊర్పు (శ్వాస), మనసులోని శ్రమకు సంకేతము}; నిగిడించుచు = పెద్దగా చేస్తూ; అర్జునుండు = అర్జునుడు; అన్న = అన్న; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ధర్మజుడు ఇలా ప్రశ్నించగానే అరచేతులతో అశ్రువులు తుడుచుకొంటూ, గద్గదకంఠంతో, పెన్నిధిని పోగొట్టుకొన్న పేదవాని మాదిరిగా వేడి వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ అర్జునుడు అన్నగారితో ఇలా అన్నాడు-