పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-356-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పితివో యిచ్చెదనని;
చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలున్
దెప్పితివో; శరణార్థుల
రొప్పితివో ద్విజులఁ, బసుల, రోగుల, సతులన్;

టీకా:

తప్పితివో = తప్పితివా ఏమిటి; ఇచ్చెదను = ఇస్తాను; అని = అని చెప్పి; చెప్పితివో = చెప్పితివా ఏమిటి; కపట = దొంగ; సాక్షి = సాక్ష్యము; చేసిన = చేసినటువంటి; మేలున్ = సహాయమును; దెప్పితివో = దుస్సహమగునట్లు చెప్పితివా ఏమిటి; శరణార్థులన్ = శరణుకోరినవారిని; రొప్పితివో = తరిమికొట్టితివా ఏమిటి; ద్విజులన్ = బ్రాహ్మణులను కాని {ద్విజుడు - పుట్టుక ఉపనయనము అనెడి ద్వి (రెండు) జుడు (జన్మములు గలవాడు), బ్రాహ్మణుడు}; పసులన్ = పసువులను కాని; రోగులన్ = రోగిష్టివారిని కాని; సతులన్ = స్త్రీలను కాని.

భావము:

అన్నమాట తప్పలేదు కదా? దొంగసాక్ష్యం చెప్పలేదు కదా? ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా? శరణార్థుల మీదా, బ్రాహ్మణుల మీదా, గోవుల మీదా, రోగులమీదా, స్ర్తీల మీదా పొరపాటున బాణాలు గుప్పలేదు కదా?