పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-350-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""వైకుంఠవాసుల డువున నెవ్వని-
లమున నానందరితు లగుచు
వెఱవక యాదవ వీరులు వర్తింతు?-
మరులు గొలువుండు ట్టి కొలువు
వికె నాకర్షించి రణసేవకులైన-
బంధుమిత్రాదుల పాదయుగము
నెవ్వడు ద్రొక్కించె నింద్రపీఠముమీఁద?-
జ్రంబు జళిపించి వ్రాలువాని

1-350.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాణవల్లభ కెంగేలఁ బాదు సేసి
మృతజలములఁ బోషింప లరు పారి
జాత మెవ్వఁడు గొనివచ్చి త్యభామ
కిచ్చె? నట్టి మహాత్మున కిపుడు శుభమె?

టీకా:

వైకుంఠ = వైకుంఠ లోకమున; వాసుల = వసించువారి; వడువునన్ = వలె; ఎవ్వని = ఎవని; బలమునన్ = బలము వలనైతే; ఆనంద = ఆనందముతో; భరితులు = నిండినవారు; అగుచు = అవుతూ; వెఱవక = బెదరక; యాదవ = యాదవులలో; వీరులు = వీరులు; వర్తింతురు = చరించెదరో; అమరులు = దేవతలు యొక్క {ఇంద్ర సభామండపము - సుధర్మామండపము}; కొలువు = ఆస్థానమున; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; కొలువు = కొలువు తీరే / సభా / ఆస్థానము; చవికెన్ = మండపమును / సుధర్మామండపము; ఆకర్షించి = తిగిచి; చరణ = పాదములను; సేవకులు = సేవించువారు; ఐన = అయిన; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; ఆదుల = మొదలగువారి; పాద = పాదములయొక్క; యుగమున్ = జంటలచే; ఎవ్వడున్ = ఎవడైతే; ద్రొక్కించెన్ = త్రొక్కించెనో; ఇంద్ర = ఇంద్రుని; పీఠము = సింహాసనము; మీఁద = మీద; వజ్రంబున్ = వజ్రాయుధమును {వజ్రాయుధముజళిపించువాడు - ఇంద్రుడు}; జళిపించి = జళిపించి {ఇంద్రునిభార్య - శచీదేవి}; వ్రాలువాని = ఆసీనుడగువాని / ఇంద్రుని; ప్రాణవల్లభ = భార్య / శచీదేవి;
కెంగేలన్ = చేతులతో; పాదు = పాదు; చేసి = చేసి; అమృత = అమృతము అను; జలములన్ = నీటితో; పోషింపన్ = పెంచుతుండగ; అలరు = అలరారే; పారిజాతము = పారిజాతమును; ఎవ్వఁడు = ఎవడైతే; కొనివచ్చి = తీసుకొనివచ్చి; సత్యభామ = సత్యభామ; కున్ = కు; ఇచ్చెన్ = ఇచ్చెనో; అట్టి = అటువంటి; మ హా = గొప్ప; ఆత్మున = ఆత్మ కలవాని / కృష్ణుని; కున్ = కి; ఇపుడు = ఇప్పుడు; శుభమే = శుభమేనా.

భావము:

అర్జునా! ఏ మహానుభావుని అండదండలవల్ల వైకుంఠంలో నివసించే వారిలాగా, ద్వారకలో నివసించే యాదవవీరులు ఆనందసహితులలై భయరహితులై ఉంటున్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మామంటపంలో తన భక్తులనూ బంధువులనూ మిత్రులనూ కూర్చుండ పెట్టాడో, ఏ మహానుభావుడు, వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తీర్చే ఇంద్రుని ప్రాణేశ్వరి అయిన శచిదేవి తన చేతులతో పాదుచేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని, దివినుంచి భువికి తీసుకొని వచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహూకరించాడో-ఆమహానుభావుడు వాసుదేవుడు క్షేమమేనా?