పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-347-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లటిలిన యుల్లముతోఁ
ల్లడపడుచున్న పిన్నమ్మునిఁ గని వె
ల్వెల్లనగు మొగముతో జను
లెల్లను విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్.

టీకా:

పల్లటిలిన = అల్లకల్లోలమైన; ఉల్లము = మనస్సు; తోన్ = తో; తల్లడపడుచున్న = తల్లడిల్లుచున్న; పిన్న = చిన్న; తమ్మునిన్ = తమ్ముడిని; కని = చూసి; వెల్వెల్లన్ = వెలవెలబోతున్నది; అగు = అయిన; మొగము = ముఖము; తోన్ = తో; జనులు = ప్రజలు; ఎల్లను = అందరును; వినన్ = వినుచుండగ; ధర్మపుత్రుడు = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; ఇట్లని = ఈవిధముగ; పలికెన్ = అడిగెను.

భావము:

అల్లకల్లోలమైన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్న తమ్ముణ్ణి చూసి ధర్మరాజు ముఖం వెలవెలబోయింది. ఆయన అందరూ వింటుండగా అర్జునునితో ఇలా పలికాడు....