పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-344-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ, పద్మాంకుశ, చాప, చక్ర, ఝష రేఖాలంకృతంబైన మా
వు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా
నీకాంతకు లేదు పో? మఱి మదీయాంగంబు వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు నిల కే యుగ్రస్థితుల్ వచ్చునో?

టీకా:

యవ = యవలు వంటి (ధాన్యంగింజ వంటి); పద్మ = పద్మముల వంటి; అంకుశ = అంకుశము వంటి {అంకుశము - ఏనుగును నడపుట యందు, కుంభ స్థలమును పొడచుటకు వాడు చిన్న గునపము వంటి సాధనము}; చాప = ధనుస్సు వంటి; చక్ర = చక్రము వంటి; ఝష = చేప వంటి; రేఖా = రేఖలతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయినట్టి; మాధవు = కృష్ణుని {మాధవుడు - 1. మా (లక్ష్మీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. మధు అను రాక్షసుని జయించినవాడు విష్ణువు, 3. మనసును రంజింపజేయువాడు, 4. మాధవి భర్త, 5. యదువు తరువాతి తరపు మధువు యొక్క వంశము వాడు, శ్రీకృష్ణుడు,}; పాద = పాదముల; ద్వయము = జంట; ఇంకన్ = ఇంక; మెట్టెడు = త్రొక్కుట వలని; పవిత్రత్వంబున్ = పవిత్రత కలుగుటలు; నేఁడు = ఈ దినము; ఆదిగాన్ = మొదలు పెట్టి; అవనీకాంత = భూదేవి; కున్ = కి; లేదు పోమఱి = లేదేమో మరి; మదీయ = నా యొక్క; అంగంబున్ = అవయవములును; వామ = ఎడమ ప్రక్క; అక్షి = కన్నును; బాహువులు = బాహువును; ఆకంపము = అదురుట; ఒందుచుండున్ = కలుగుచున్నది; ఇల = భూమి; కున్ = కి; ఏ = ఏ; ఉగ్ర = భయంకరమైన; స్థితుల్ = పరిస్థితులు; వచ్చునో = వచ్చునో.

భావము:

నాయనా! భీమసేనా! యవగింజ, చక్ర, చాప, పద్మ, అంకుశాది శుభరేఖలతో అలంకృత మైన వాసుదేవుని పాదపద్మాల ముద్రలతో పావనమయ్యే అదృష్టం ఇకపైన ఈ భూదేవికి లేదేమో? నా అవయవాలు ఎడం కన్నూ, ఎడం భుజం మాటిమాటికీ అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎలాంటి భీకర పరిస్థితులు రానున్నాయో కదా.