పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-342-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లెడు వేల్పుల రూపులు,
లెడుఁ గన్నీరు, వానిలనం జెమటల్
వొలెడిఁ, బ్రతిమలు వెలిఁ జని
మెలెడి నొక్కక్క గుడిని మేదిని యందున్.

టీకా:

కదలెడున్ = కదలుచున్నవి; వేల్పుల = దేవతల; రూపులు = విగ్రహములు; వదలెడున్ = కార్చుతున్నవి; కన్నీరు = కన్నీరు; వాని = వాటి; వలనన్ = నుండి; చెమటల్ = స్వేదములు; ఒదలెడిన్ = చమరించుచున్నవి; ప్రతిమలు = విగ్రహములు; వెలిన్ = బయటకు; చని = వెళ్ళి; మెదలెడిన్ = సంచరించుచున్నవి; ఒక్కక్క = ఒక్కొక్క; గుడిని = గుడియందు; మేదిని = భూమి; అందున్ = మీద.

భావము:

దేవమందిరాలలో దేవతావిగ్రహాలు కదులుతున్నాయి. కన్నీరు వదులుతున్నాయి. గుడిలోని ప్రతిమలు ఉక్క తాళలేకనేమో వెలుపలకు వెళ్ళిపోతున్నాయి.