పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్రములు పోరాడెడి నా
గ్రముల వినఁ బడియె; భూత లకలములు దు
స్సములగుచు శిఖికీలా
ముల క్రియఁ దోచె; గగన సుధాంతరముల్.

టీకా:

గ్రహములు = గ్రహములు; పోరాడెడిన్ = పోరాడుతున్నవి; ఆగ్రహముల = కోపములతో; వినఁబడియెన్ = వినబడుతున్నవి; భూత = జీవులు యొక్క; కలకలములు = కలకలారావములు; దుస్సహములు = సహించుటకు మిక్కిలి కష్టమగునవి; అగుచున్ = అవుతూ; శిఖి = అగ్ని; కీలా = కీలలు; ఆవహముల = ఆవహించిన; క్రియన్ = వలె; దోచెన్ = అనిపిస్తున్నవి; గగన = ఆకాశము; వసుధ = భూమి; అంతరముల్ = కలిసిన చోట్లు, దిఙ్మండల రేఖలు.

భావము:

గ్రహాలు ఆగ్రహంతో పోరాడుకొంటున్నాయి. ఎటు చూసినా భూతాల కలకలాలు వినబడుతున్నాయి. మన్నూ మిన్నూ ఏకమై భగ భగ మండిపోతున్నట్లు తోస్తున్నది.