పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-338-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డక ముందట నొక సారమేయంబు-
మొఱగుచు నున్నది మోర యెత్తి;
యాదిత్యుఁ డుదయింప భిముఖంబై నక్క-
వాపోయె మంటలు వాతఁ గలుగ;
మిక్కిలుచున్నవి మెఱసి గృధ్రాదులు-
ర్దభాదులు దీర్చి క్రందుకొనియె;
నుత్తమాశ్వంబుల కుదయించెఁ గన్నీరు-
త్తగజంబుల దము లుడిగె;

1-338.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాలు దూతభంగిఁ దిసెఁ గపోతము;
మండ దగ్ని హోమ మందిరములఁ;
జుట్టుఁ బొగలు దిశల సొరిది నాచ్ఛాదించెఁ;
రణి మాసెఁ; జూడు రణి గదలె.

టీకా:

ఓడక = జంకక; ముందటన్ = ముందర; ఒక = ఒక; సారమేయంబు = కుక్క; మొఱగుచున్ = మొఱగుచును (కుక్కఅరుపు); ఉన్నది = ఉన్నది; మోర = మెడ; ఎత్తి = పైకెత్తి; ఆదిత్యుఁడు = సూర్యుడు; ఉదయింప = ఉదయిస్తుంటే; అభిముఖంబు = ఎదురు; ఐ = అయ్యి; నక్క = నక్క; వాపోయె = ఏడుస్తున్నట్టు అరుచుచున్నది; మంటలు = మంటలు; వాతన్ = వాంతి; కలుగ = చేసు కుంటుండగ; మిక్కిలుచున్నవి = గుంపులు కడుతున్నవి; మెఱసి = బయల్పడుచు; గృధ = గద్ధలు; ఆదులు = మొదలగునవి; గర్దభ = గాడిదలు; ఆదులు = మొదలగునవి; తీర్చి = బారులు తీరి; క్రందుకొనియె = మూగుతున్నవి; ఉత్తమ = ఉత్తమ జాతి; అశ్వంబుల = గుఱ్ఱముల; కున్ = కు; ఉదయించెన్ = కనిపిస్తున్నది; కన్నీరు = కన్నీరు; మత్త = మదపు; గజంబుల = ఏనుగుల యొక్క; మదము = మదములు; ఉడిగె = ఎండిపోవు తున్నది; కాలు = యముని; దూత = భటుని; భంగిన్ = వలె; కదిసెన్ = మీదకి వచ్చింది; కపోతము = పావురము;
మండదు = మంటలు రావడంలేదు (రాజేస్తున్నా); అగ్ని = నిప్పునుంచి (హోమగుండాలలో); హోమ = హోమాలు చేయు; మందిరములన్ = శాలలో; చుట్టున్ = చుట్టూ; పొగలు = పొగలు; దిశల = దిశలువెంట; సొరిది = క్రమముగా; ఆచ్ఛాదించెన్ = క్రమ్మినవి; తరణి = సూర్యుడు; మాసెన్ = మసకబారెను; చూడు = చూడుము; ధరణి = భూమి; కదలె = కంపించెను.

భావము:

అదుగో మన ముందుగా ఒక్క కుక్క ముఖం పై కెత్తి మొరుగుతున్నది. నక్క ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి నోటి వెంట నిప్పులు గ్రక్కుతూ ఏడుస్తున్నది. గ్రద్దలు మొదలైన పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. గాడిదలు మొదలైన జంతువులు బారులు తీర్చినాయి. మేలిజాతి గుఱ్ఱాలు కన్నీరు కారుస్తున్నాయి. మదపుటేనుగులు నీరుగారి పోతున్నాయి. కపోతాలు యమదూతల్లాగా పైపైకి వస్తున్నాయి. హోమకుండాల్లో అగ్నిహోత్రాలు మండటంలేదు. దట్టమైన పొగలు దిక్కు లంతటా చుట్టుముట్టాయి. సూర్యబింబం మసక వేసినట్లుగా ఉంది. భూమి కంపించుతూ ఉంది.