పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-336-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వులు సెప్పక ముందఱ
దార ప్రాణ రాజ్య మానశ్రీలన్
నుపుదు నని మాధవుఁ డిట
మునఁ దలపోసి మనిచె నలం గరుణన్.

టీకా:

మనవులు = విన్నపములు; చెప్పక = విన్నవించుకోక; ముందఱ = ముందరనే; మన = మన యొక్క; దార = భార్యలు; ప్రాణ = ప్రాణములు; రాజ్య = రాజ్యములు; మాన = మానములు అనే; శ్రీలన్ = సంపదలను; మనుపుదును = రక్షింతును; అని = అని; మాధవుఁడు = హరి {మాధవుడు - 1. మా (లక్ష్మీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. మధు అను రాక్షసుని జయించినవాడు విష్ణువు, 3. మనసును రంజింపజేయువాడు, 4. మాధవి భర్త, 5. యదువు తరువాతి తరపు మధువు యొక్క వంశము వాడు, శ్రీకృష్ణుడు,}; ఇట = ఇక్కడ; మనమునన్ = మనసులో; తలపోసి = అనుకొని; మనిచెన్ = మనజేసెను, బ్రతికించెను; మనలన్ = మనలను; కరుణన్ = కరుణతో.

భావము:

ఆ మధుసూదనుడు మనం విన్నవించుకొనక ముందే మన కష్టాలన్నీ గుర్తించి మన ధర్మపత్నినీ, ప్రాణాలనూ, రాజ్యాన్నీ, మర్యాదనూ, సిరిసంపదలనూ కంటికి రెప్పలా కాపాడాడు.