పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-333-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""క కాలమునఁ బండు నోషధిచయము వే-
ఱొక కాలమునఁ బండకుండు నండ్రు;
క్రోధంబు లోభంబుఁ గ్రూరత బొంకును-
దీపింప నరులు వర్తింతు రండ్రు;
వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు-
ఖ్యంబు వంచనా హిత మండ్రు;
గలతో నిల్లాండ్రు చ్చరించెద రండ్రు-
సుతులు దండ్రులఁ దెగఁ జూతు రండ్రు;

1-333.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు;
శాస్త్రమార్గము లెవ్వియుఁ రుగ వండ్రు;
న్యాయపద్ధతి బుధులైన డవ రండ్రు;
కాలగతి నింతయై వచ్చెఁ గంటె నేఁడు.

టీకా:

ఒక = ఒక; కాలమునన్ = కాలములో; పండు = పండునట్టి; ఓషధి = ధాన్యముల; చయము = సమూహము; వేఱొక = మరియొక; కాలమునన్ = కాలములో; పండకుండున్ = పండవు; అండ్రు = అందురు; క్రోధంబు = క్రోధము; లోభంబు = లోభము; క్రూరత = క్రూరత్వము; బొంకును = అసత్యము; దీపింపన్ = చెలరేగగ, ఎక్కువకాగా; నరులు = మానవులు; వర్తింతురు = ఉండుదురు; అండ్రు = అందురు; వ్యవహారములు = తగవులు, పరిష్కారములు; మహా = మిక్కిలి; వ్యాజ = మిషలతో; యుక్తములు = కూడుకొన్నవి; అండ్రు = అందురు; సఖ్యంబు = స్నేహములు; వంచనా = వంచనతో; సహితము = కూడినవి; అండ్రు = అందురు; మగలు = భర్తలు; తోన్ = తో; ఇల్లాండ్రు = భార్యలు; మచ్చరించెదరు = స్పర్దిస్తారు ద్వేషిస్తారు; అండ్రు = అందురు; సుతులు = సంతానము; తండ్రులన్ = తండ్రులను; తెగన్ = దిక్కరించ వలనని; చూతురు = చూచెదరు; అండ్రు = అందురు;
గురుల = గురువులను; శిష్యులు = శిష్యులు; దూషించి = నిందించి; కూడరు = కలిసిరారు; అండ్రు = అందురు; శాస్త్ర = శాస్త్రీయ; మార్గములు = విధానములు; ఎవ్వియున్ = ఏవికూడా; జరుగవు = నడవవు, సాగవు; అండ్రు = అందురు; న్యాయ = న్యాయమైన; పద్ధతి = పద్ధతిలో; బుధులు = బుద్ధిమంతులు; ఐన = అయినను, కూడా; నడవరు = నడువరు; అండ్రు = అందురు; కాల = కాలానుగుణ; గతి = విధానములు; ఇంత = ఈ విధముగ; ఐ = అయ్యి; వచ్చెన్ = వచ్చెను; కంటె = చూచితివా; నేఁడు = ఈవేళ.

భావము:

తమ్ముడూ చూశావు కదా కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో పంటలు సకాలానికి పండటం లేదు. క్రోధం, లోభం క్రౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాలలో మోసం చోటు చేసుకొంటున్నది. స్నేహంలో ద్రోహం కనిపిస్తూ ఉంది. భార్యలు భర్తలతో స్పర్దిస్తున్నారు. కొడుకులు కన్నతండ్రులపై కాలుదువ్వుతున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్రవిధులు కుంటుబడ్డాయి. విజ్ఞులు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలగమనం ఎంతగా వింతగా మారిపోయింది.