పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-331-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంట వారల మరణము
విం యగుచుఁ జూడఁబడిన విదురుఁడు చింతా
సంతాప మొదవఁ బ్రీత
స్వాంతుండై తీర్థములకుఁ నియెడు నధిపా!”

టీకా:

అంతట = అప్పుడు; వారల = వారియొక్క; మరణమున్ = మరణములు; వింత = విచిత్రము; అగుచున్ = అవుతూ; చూడఁబడిన = చూసిన; విదురుఁడు = విదురుడు; చింతా = దుఃఖము వలన; సంతాపము = బాధ; ఒదవన్ = కలుగగా; ప్రీత = వదులైన; స్వాంతుండు = స్వాంతము కలవాడు; ఐ = అయి; తీర్థములు = పుణ్యక్షేత్రములు; కున్ = కు; చనియెడున్ = వెళ్ళును; అధిపా = గొప్పవాడా.

భావము:

అప్పుడు ఆ మహారాజ దంపతుల ఆత్మత్యాగానికి ఆశ్చర్యచకితుడైన విదురుడు చింతా సంతాపాలు పెనగొనిన హృదయంతో పుణ్యతీర్థాలకు వెళ్లిపోతాడు.""