పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

  •  
  •  
  •  

1-323-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""ఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు
డుగఁ డీ రేయి మీ తండ్రి వనినాథ!
మందిరములోన విదురుతో మంతనంబు
నిన్న యాడుచు నుండెను నేఁడు లేఁడు.

టీకా:

అఖిల = సమస్తమైన; వార్తలు = వార్తలు; మున్ను = ఇంతకు ముందు; నన్ను = నన్ను; అడుగుచుండున్ = అడుగుతుండేవాడు; అడుగఁడు = అడగలేదు; ఈ = ఈ; రేయి = రాత్రి; మీ = మీయొక్క; తండ్రి = తండ్రి; అవనినాథ = రాజ {అవనినాథుడు - అవని (భూమి)కి నాథుడు, రాజు.}; మందిరము = అంతఃపురము; లోనన్ = లోపల; విదురు = విదురుని; తోన్ = తో; మంతనంబు = ఇష్టాపూర్వక సంభాషణములు; నిన్న = క్రిందటి రోజు; ఆడుచున్ = మాట్లాడుచును; ఉండెను = ఉండెను; నేఁడు = ఈ రోజు; లేఁడు = లేడు.

భావము:

""ధర్మరాజా! నీపెద తండ్రిగారు ప్రతిదినమూ వార్తలేమిటని నన్ను అడుగుతుండేవారు. ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు. నిన్నటివరకూ రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు చేస్తూ ఉండేవాడు. ఈనాడు కంటికి కన్పించకుండా వెళ్ళిపోయాడు.