పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

  •  
  •  
  •  

1-321.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భార్యతోడఁ దండ్రి రితాపమునఁ బడుఁ,
పట మింత లేదు రుణ గలదు,
పాండుభూవిభుండు రలోకగతుఁడైన
మ్ముఁ బిన్నవాండ్ర నిచె నతఁడు."

టీకా:

మా = మాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ఈ = ఈ; మందిరమునన్ = భవనములో; లేరు = లేరు; సంజయ = సంజయ; వారు = వారు; ఎందున్ = ఎక్కడికి; చనిరి = వెళ్ళితిరి; నేఁడు = ఈవేళ; ముందఱన్ = ఎదురుగ ఉన్నదే; కానఁడు = చూడలేడు; ముదుసలి = ముసలి వాడు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; పుత్ర = పుత్రుల వలని; శోకంబునన్ = వేదనతో; పొగులున్ = దుఃఖించును; తల్లి = తల్లి; సౌజన్య = మంచితనమునకు; నిధి = నివాసము; ప్రాణ = ప్రాణముతో సమానమైన; సఖుఁడు = స్నేహితుడు; మా = మాయొక్క; పినతండ్రి = చిన్నాన్న; మంద = మందగించిన; బుద్ధులము = బుద్ధి కలిగిన వారలము; ఐన = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; విడిచి = వదలివైచి; ఎటన్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; మువ్వురు = ముగ్గురు; ఎఱిఁగింపు = తెలియజేయుము; గంగ = గంగానది; లోన్ = లో; తన = తనయొక్క; అపరాధంబున్ = తప్పులను; తడవికొనుచు = తలచుకొనుచు;
భార్య = భార్య; తోడన్ = తోపాటు; తండ్రి = తండ్రి; పరితాపమునన్ = వేదనలో; పడున్ = పడును; కపటము = అబద్ధము; ఇంత = ఇంతకూడ; లేదు = లేదు; కరుణ = దయ; కలదు = కలదు; పాండు = పాండు; భూవిభుండు = రాజు; పరలోకగతుఁడు = చనిపోయిన వాడు; ఐన = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; పిన్నవాండ్రన్ = పిల్లవాళ్ళను; మనిచె = పెంచి పోషించెను; అతఁడు = అతడు.

భావము:

"సంజయా!. మా తల్లీ తండ్రీ ఈ మేడలో కన్పించటం లేదు. వారెక్కడికి వెళ్లారో తెలియదు. మా తండ్రిగారు కంటిచూపు కరువైన మూడుకాళ్లముసలి. మా తల్లిగారు కడివెడు శోకంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటుంది. మా పినతండ్రిగారు మాకు ప్రాణ సమానుడు. సౌజన్యమూర్తి. ఈ ముగ్గురూ మందమతులమైన మమ్మల్ని వదలిపెట్టి ఎటు పాయారో తెలియదు. మా పెదతండ్రిగారు ఒకవేళ తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది భార్యతో కూడా గంగలో దూకాడేమోనని అనుమానంగా ఉంది. తెలిస్తే చెప్పు. ఆయన చాలా అమాయకుడు, కరుణార్ద్రహృదయుడు. మా తండ్రి పాండుభూపాలుడు పరలోకగతుడు కాగా పిన్నవాళ్లమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేశారు."