పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-312-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుట్టంధుండవు, పెద్దవాఁడవు, మహాభోగంబులా లేవు, నీ
ట్టెల్లం జెడిపోయె, దుస్సహ జరాభారంబు పైఁగప్పె, నీ
చుట్టా లెల్లనుఁ బోయి; రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై
ట్టా! దాయలపంచ నుండఁదగవే? కౌరవ్యవంశాగ్రణీ!

టీకా:

పుట్టు = పుట్టుకతోనే; అంధుండవు = గ్రుడ్డివాడవు; పెద్దవాఁడవు = వయసులో పెద్దవాడవు; మహా = గొప్ప; భోగంబులా = భోగములు అంటే అవీ; లేవు = లేవు; నీ = నీయొక్క; పట్టు = బలము; ఎల్లన్ = అంతా; చెడి = పాడు; పోయెన్ = అయిపోయినది; దుస్సహ = సహింప కష్టమైనది; జరా = ముసలితనము; భారంబున్ = బరువుగా; పైన్ = మీద; కప్పెన్ = పడెను; నీ = నీయొక్క; చుట్టాలు = బంధువులు; ఎల్లను = అందరును; పోయిరి = చనిపోయిరి; ఆలు = భార్య; మగఁడున్ = భర్తా; శోకంబునన్ = శోకములో; మగ్నులు = మునిగిన వారు; ఐ = అయి; కట్టా = అయ్యో; దాయల = శత్రువులయొక్క, దాయాదులయొక్క; పంచన్ = నీడలో; ఉండన్ = ఉండగా; తగవే = ఉచితమా; కౌరవ్య = కౌరవులయొక్క; వంశ = వంశమునకు; అగ్రణీ = గొప్పవాడా.

భావము:

ఓ కురుకులశిరోమణీ అసలు నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా ఇప్పుడు మూడుకాళ్ల ముసలివైనావు. మహారాజ వైభవాలన్నీ అంతరించాయి. అధికారం అడుగంటింది. భరింపరాని వార్ధక్యం పైన బడింది. నా అన్నవారు అంతా గతించారు. ఇప్పుడు ఈ విధంగా బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండు దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయ్యో దాయాదులైన పాండవుల పంచలో పడి ఉండటం ఏమంత బాగుంది.