పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-310-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది నిమిత్తంబుగాఁ గాలగతి యెఱింగి విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియె.

టీకా:

అది = ఆ; నిమిత్తంబుగాన్ = కారణమువలన; కాల = కాలముయొక్క; గతి = లక్షణము, నడక; ఎఱింగి = తెలిసి; విదురుండు = విదురుడు; ధృతరాష్ట్రున = ధృతరాష్ట్రున; కు = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అందువల్ల కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు...