పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-302.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేఱు తీర్థంబు లవనిపై వెదక నేల?
మిమ్ముఁ బొడగని భాషించు మేల చాలు,
వార్త లేమండ్రు లోకులు సుధలోన?
మీకు సర్వంబు నెఱిఁగెడి మేధ గలదు.

టీకా:

ఏ = ఏ; వర్తనంబునన్ = విధమున; ఇంతకాలము = ఇంతకాలము; మీరు = మీరు; సంచరించితిరి = తిరిగితిరి; అయ్య = ఓయయ్య; జగతి = లోకము; లోనన్ = అందు; ఏ = ఏ; తీర్థములు = పుణ్యస్థలములు; కంటిరి = చూచితిరి; ఎక్కడ = ఎక్కడ; ఉంటిరి = ఉంటిరి; భావింపన్ = ఆలోచించి చూసిన; మీ = మీ; వంటి = లాంటి; భాగవతులు = భాగవతులు, భగవద్భక్తులు; తీర్థ = పుణ్యస్థలముల; సంఘంబులన్ = సమూహములను; ధిక్కరింతురు = అధిగమింతురు; కదా = కదా; మీ = మీ; అందున్ = లోన; విష్ణుండు = విష్ణుమూర్తి, భగవంతుడు; మెఱయు = ప్రకాశించుట; కతనన్ = వలన; మీరు = మీరు; తీర్థంబులు = పుణ్యస్థలములు; మీకు = మీకు; కంటెన్ = మించి; మిక్కిలి = పెద్ద; తీర్థంబులు = పుణ్యస్థలములు; ఉన్నవే = ఉన్నవా, లేవు; తెలిసి = తెలుసుకొని; చూడ = చూడగా;
వేఱు = వేరే; తీర్థంబులున్ = పుణ్యస్థలములు; అవని = భూమి; పైన్ = మీద; వెదకన్ = వెతుకుట; ఏలన్ = ఎందులకు; మిమ్మున్ = మిమ్ములను; పొడగని = దర్శించుకొని; భాషించు = మాట్లాడుట అనే; మేల = మేలు; చాలున్ = చాలును; వార్తలు = వార్తావిశేషములు; ఏమి = ఏమి; అండ్రు = చెప్పుదురు; లోకులు = జనులు; వసుధ = లోకము; లోనన్ = లో; మీకు = మీకు; సర్వంబున = సమస్తమును; ఎఱిఁగెడి = తెలిసికొను; మేధ = తెలివి; కలదు = ఉన్నది.

భావము:

అయ్యా ఇంతకాలమూ మీరు ఏయే ప్రాంతాలు సందర్శించారు ఎలా ఎలా సంచరించారు ఏయే పుణ్యతీర్థాలు సేవించారు ఏయే ప్రదేశాల్లో నివసించారు మీవంటి పరమభాగవతోత్తములు తీర్థాలను లెక్కచేయరుగదా మీలో భగవంతుడు సన్నిధిచేసి ఉన్నాడు. కనుక మీరే పుణ్యతీర్థాలు, ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్థాలు పుడమిలో ఎక్కడో ఉన్నాయి మీవంటి మహాత్ములను దర్శించి సంభాషించే అదృష్టం అబ్భితే చాలదా వేరే తీర్థాలకోసం వెదకవలసిన పనేమున్నది మీరు సర్వజ్ఞులు, వివేకవంతులు. ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు.