పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గర్భస్థకుని విష్ణువు రక్షించుట

  •  
  •  
  •  

1-282-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిచ్చఱకోలవశంబునఁ
చ్చి బహిర్గతుఁడఁ గాని మయమునను దా
నుచ్చలిత గర్భవేదనఁ
చ్చును మా తల్లి ఘోర సంతాపమునన్.

టీకా:

చిచ్చఱ = అగ్నిమయమైన, చిచ్చు+అఱ (ఉకార సంధి); కోల = బాణము; వశంబునన్ = వలన; చచ్చి = చనిపోయి; బహిర్గతుఁడన్ = బయటపడువాడు; కాని = కానట్టి; సమయమునను = సమయములో; తాన్ = తను; ఉచ్చలిత = చెదరిపోయిన; గర్భ = గర్భమువలని; వేదనన్ = బాధతో; చచ్చును = చనిపోవును; మా = మాయొక్క; తల్లి = తల్లి; ఘోర = ఘోరమైన; సంతాపమునన్ = శోకముతో.

భావము:

అయ్యో ఈ చిచ్చులు చిమ్మే భయంకరబాణం వల్ల నేను చచ్చిపోవటం తథ్యం. కడుపులోని మృతశిశువును కనలేక అతిశయించిన గర్భవేదనతో అల్లాడి, అమ్మకూడా మరణించటం తప్పదు.