పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-270-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యడిగిన వారలు హరిం బాసిన దినంబు లందు శరీరసంస్కార కేళీవిహార హాస వనమందిరగమన మహోత్సవదర్శనంబు లొల్లని యిల్లాండ్రు కావున.

టీకా:

అని = ఆ విధముగా; అడిగినన్ = అడుగగా; వారలు = వారు; హరిన్ = కృష్ణుని; పాసిన = ఎడబాటు చెందిన; దినంబులు = రోజులు; అందున్ = లో; శరీర = శరీరములను; సంస్కార = చక్కదిద్దు కొనుటలు; కేళీ = సరదాలకి; విహార = విహరించుటలు; హాస = నవ్వుటలు; వన = వనములకు; మందిర = మందిరములకు; గమన = వెళ్ళుటలు; మహోత్సవ = మహోత్సవములను; దర్శనంబులు = చూడబోవుటలు; ఒల్లని = అంగీకరింపని; ఇల్లాండ్రు = భార్యలు; కావున = అగుట మూలమున.

భావము:

ఆ కాంత లంతా తమ కాంతుడు ద్వారకలో లేని దినాలలో శరీర సంస్కారాలు, లీలా విలాసాలు, పరిహాస భాషణాలు, ఉద్యాన విహారాలు, ఆలయ గమనాలు, మహోత్సవ సందర్శనాలు ఇష్టపడని ఇల్లాండ్రు. అందువల్ల వారు.