పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-268-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్
వంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?
తొవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా?
మల్ గావు గదా? భవన్నిలయముల్ ల్యాణయుక్తంబులే?

టీకా:

కొడుకుల్ = కొడుకులు; భక్తి = భక్తితో; విధేయులు = లొంగినవారు; ఔదురు = అవుతారు; కదా = కదా; కోడండ్రు = కోడళ్ళు; మీ = మీ యొక్క; వాక్యముల్ = మాటలు; గడవన్ = దాటుటకు; చాలక = సరిపోకుండగ; ఉందురా = ఉంటారా; విబుధ = పండితులకు; సత్కారంబున్ = మర్యాదలు; కావింతురా = చేయుదురా; తొడవుల్ = ఆభరణములు; వస్త్రములున్ = బట్టలు; పదార్థ = పదార్థములు; రస = రసముల; సందోహంబులున్ = సమూహములు; చాలునా = సరిపోవుచున్నవా; కడమల్ = కొరతలు; కావున్ = కలుగుట లేదు; కదా = కదా; భవత్ = మీయొక్క; నిలయముల్ = ఇండ్లలో; కల్యాణ = శుభములు; యుక్తంబులే = కూడినవేనా.

భావము:

“మీ కొడుకులు వినయవినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా; మీ కోడళ్లు మీ మాటలు జవదాటకుండ ఉన్నారా; బాగా చదువుకున్న విద్వాంసు లరుదెంచి నప్పుడు సత్కారాలు చేస్తున్నారా; నగలు, చీరలు, రసవంతాలైన మధర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా; మీకు ఎట్టి లోటూ వాటిల్లటం లేదు కదా.