పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-266-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా
తుఁడయ్యెన్ మును సేరెఁ బో తొలుత మత్కాంతుండు నా శాలకే
నిరాలభ్య సుఖంబు గంటి" నని తారింటింట నర్చించి ర
య్యతివల్ నూఱుఁబదారువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరున్.

టీకా:

పతి = భర్త; నా = నాయొక్క; ఇంటి = ఇంటి; కిన్ = కి; మున్ను = ముందు; వచ్చెన్ = వచ్చెను; ఇదె = ఇదిగో; నా = నాయొక్క; ప్రాణేశుఁడు = భర్త {ప్రాణేశుడు - ప్రాణములకు ఈశుడు (ప్రభువు), భర్త}; అస్మత్ = మాయొక్క; గృహా = ఇంటికి; ఆగతుఁడు = వచ్చినవాడు; అయ్యెన్ = ఆయెను; మును = ముందుగ; సేరెన్ = చేరెను; పో = కదా; తొలుత = ముందు; మత్ = నాయొక్క; కాంతుండు = ప్రియుడు; నా = నాయొక్క; శాల = ఇంటి; కిన్ = కి; ఏన్ = నేను; ఇతర = ఇంకొక విధమున; అలభ్య = లభ్యము కానట్టి; సుఖంబున్ = సుఖమును; కంటిని = చూసితిని; అని = అని; తారు = తాము; ఇంటింటన్ = అన్ని ఇళ్ళలోను; అర్చించిరి = పూజించిరి; ఆ = ఆ; అతివల్ = స్త్రీలు; నూఱుఁ బదారువేలు నెనమండ్రు = నూటపదహారువేల ఎనమిదిమంది, నూఱు + పదారు * వేలు + ఎనమండ్రు; ఆ = ఆ; వేళన్ = సమయములో; ఆత్మ = తమ; ఈశ్వరున్ = భర్తను.

భావము:

పదహారువేల నూట యెనిమిదిమంది రమణీమణులు”యిదుగో నా భర్త తొట్టతొలుత నా యింటికే వచ్చాడు. నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా ప్రాణేశ్వరుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను” అనుకొంటూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి ఆర్చించారు.