పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-265-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిశువులఁ జంకలనిడి తను
కృతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్
నలు జాఱఁగ సిగ్గున
శిముఖు లెదురేఁగి రపుడు లజాక్షునకున్.

టీకా:

శిశువులన్ = పిల్లలను; చంకలన్ = చంకలో; ఇడి = ఉంచి, ఎత్తుకొని; తను = శరీరము; కృశతలు = చిక్కిపోవుటలు; విరహ = ఎడబాటు అనే; అగ్నిన్ = అగ్నిని; తెలుప = తెలుపుతుండగ; గృహ = ఇంటి; గేహళులన్ = గుమ్మములలో; రశనలు = మొలనూళ్లు; జాఱఁగ = జారిపోతుండగ; సిగ్గున = లజ్జవలన; శశిముఖులు = స్త్రీలు {శశిముఖి - చంద్రునివంటి ముఖము కల స్త్రీ}; ఎదుర = ఎదురుగ; ఏఁగిరి = వెళ్ళిరి; అపుడు = ఆ సమయమున; జలజాక్షున్ = కృష్ణుని {జలజాక్షుడు - జలజ (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు, విష్ణువు}; కున్ = కి.

భావము:

ఆ చంద్రముఖు లందరు చంటిబిడ్డలను చంకలలో ఎత్తుకొని, విరహతాపంవల్ల చిక్కిపోయిన శరీరాలతో, దిగ్గున లేచి కాంచీకలాపాలు జారిపోగా సిగ్గుతో యదుచంద్రునికి ఎదురువచ్చారు.