పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-263-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భామాభవనంబు మున్నుసొర వేఱొక్కర్తు లోఁగుందునో
సురాలాపము లాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో
విలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్
ప్రటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూవ్యక్తుఁడై భార్గవా!

టీకా:

ఒక = ఒక; భామా = భార్య యొక్క; భవనంబు = భవనము; మున్ను = ముందుగ; చొరన్ = చేరితే; వేఱొకర్తు = ఇంకొకామె; లోన్ = మనసులో; కుందునో = క్రుంగునేమో; సుకర = సుఖకరములైన; ఆలాపములు = మాటలు; ఆడదో = పలుకదేమో; సొలయునో = వైముఖ్యమును పొందునేమో; సుప్రీతిన్ = బాగా ప్రేమతో; వీక్షింపదో = చూడదేమో; వికలత్వంబునన్ = చెదిరినమనసుతో; ఉండునో = ఉండునేమో; అనుచున్ = అనుకొనుచు; ఆ = ఆ; వేళన్ = సమయములో; వధూ = భార్యల; గేహముల్ = గృహములు; ప్రకట = ప్రకటింపబడిన; ఆశ్చర్య = ఆశ్చర్యకరమైన; విభూతిన్ = వైభవముతో; చొచ్చె = ప్రవేశించెను; బహు = అనేకములైన; రూప = రూపములతో; వ్యక్తుఁడు = వ్యక్తమైనవాడు, కనిపించినవాడు; ఐ = అయి; భార్గవా = శౌనకా {భార్గవుడు - భృగువు వంశములో పుట్టినవాడు, శౌనకుడు, శుక్రుడు, పరశురాముడు}.

భావము:

భృగువంశోద్భవుడవైన శౌనకా! ముందుగా ఒక సతి మందిరానికి వెళ్తే వేరొకామె కుందుతుందేమో; తొందరపాటుతో సరిగా మాట్లాడదేమో; సొక్కిపోతుందేమో; ప్రేమతో వీక్షించదేమో; వైకల్యం వహిస్తుందేమో అని అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒకేమారు ప్రవేశించాడు.