పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-255-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంధకారవైరి పరాద్రి కవ్వలఁ
నిన నంధమయిన గముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల గుదు మయ్య."

టీకా:

అంధకారవైరి = సూర్యుడు {అంధకారవైరి - చీకటికి శత్రువు, సూర్యుడు}; అపర = పడమటి; అద్రి = కొండ; కిన్ = కు; అవ్వలన్ = ఆవతల పక్కకి; చనినన్ = వెళ్ళగా; అంధము = చీకటిగా; అయిన = అయి నట్టి; జగము = లోకము; భంగిన్ = వలె; నిన్నున్ = నిన్ను; కానక = చూడగా లేకుండగ; ఉన్న = ఉన్న యెడల; నీరజలోచన = కృష్ణ {నీరజలోచనుడు - (నీరజము) పద్మము వంటి కన్నుల ఉన్న వాడు}; అంధతమస = చీకటి వంటి అజ్ఞానముతో కూడిన; మతులము = బుద్ధి కల వారము; అగుదుము = అవుతాము; అయ్య = తండ్రీ.

భావము:

సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.”