పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-248-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధులుఁ బౌరులుఁ దెచ్చిన
గంధేభ హయాదులైన కానుకలు దయా
సింధుఁడు గైకొనె నంబుజ
బంధుఁడు గొను దత్త దీప పంక్తులభంగిన్.

టీకా:

బంధులున్ = బంధువులును; పౌరులున్ = పౌరులును; తెచ్చిన = తీసుకు వచ్చిన; గంధేభ = మదించిన ఏనుగులు; హయ = గుఱ్ఱములు; ఆదులు = మొదలగునవి; ఐన = అయినట్టి; కానుకలు = కానుకలు; దయాసింధుఁడు = కృష్ణుడు {దయాసింధుడు - దయాసముద్రుడు, కృష్ణుడు}; కైకొనె = స్వీకరించెను; అంబుజబంధుఁడు = సూర్యుడు {అంబుజబంధువు - పద్మముల బంధువు, సూర్యుడు}; కొను = స్వీకరించు; దత్త = ఒసగబడిన; దీప = దీపముల; పంక్తుల = వరుసలు; భంగిన్ = వలె.

భావము:

బంధుమిత్రులు, ప్రజలు తీసుకు వచ్చిన ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన బహుమతులను దయాసాగరుడైన శ్రీకృష్ణమూర్తి, భక్తు లర్పించిన దీపపంక్తులను పరిగ్రహించే పద్మబంధునిలా అందుకొన్నాడు.