పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-244-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం,
హంసావృతహేమపద్మపరిఖా కాసారకం, దోరణా
ళిసంఛాదితతారకం, దరులతార్గానువేలోదయ
త్ఫపుష్పాంకుర కోరకన్, మణిమయప్రాకారకన్, ద్వారకన్.

టీకా:

జలజాతాక్షుఁడు = కృష్ణుడు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు, విష్ణువు}; శౌరి = కృష్ణుడు {శౌరిః- శూరుని మనుమడు, కృష్ణుడు, బలవత్తరములైన ఇంద్రియ మనో బుద్దులను అణచినవాడు, విష్ణుసహస్రనామాలు 340వ నామం}; డగ్గఱెన్ = సమీపించెను; మహా = పెద్ద; సౌధ = మేడల; అగ్ర = అగ్ర భాగములచే; శృంగారకన్ = అలంకరింపబడినదైన; కల = మనోహరమైన కంఠధ్వని కల; హంస = హంసలచే; ఆవృత = చుట్టబడిన; హేమ = బంగారు రంగు పుప్పొడి కలిగిన; పద్మ = పద్మములతో కూడిన; పరిఖా = కందకములు; కాసారకన్ = కోనేళ్ళు కలదైన; తోరణా = తోరణముల; ఆవళి = సమూహముచే; సంఛాదిత = బాగాకప్పబడిన; తారకన్ = నక్షత్రములు కలదైన; తరు = చెట్ల; లతా = లత; వర్గ = వరుసలు; అనువేల = ఎల్లప్పుడు; ఉదయత్ = ఉద్భవిస్తున్న; ఫల = పండ్లు; పుష్ప = పుష్పములు; అంకుర = మొలకలు; కోరకన్ = మొగ్గలును కలదైన; మణి = రత్నములు; మయ = తాపిన; ప్రాకారకన్ = ప్రహారీగోడ కలదైన; ద్వారకన్ = ద్వారకా నగరమును.

భావము:

బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది; కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగడ్తలు చుట్టు కలది; చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తుల వృక్షాలు కలది; రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకానగరాన్ని తామరరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు.