పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మనందన రాజ్యాభిషేకంబు

  •  
  •  
  •  

1-235-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నకసౌధములపైఁ గౌరవకాంతలు-
గుసుమవర్షంబులు గోరి కురియ,
మౌక్తికదామ సమంచితధవళాత-
త్త్రంబు విజయుండు ట్టుచుండ,
నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై-
త్నభూషితచామములు వీవ,
గనాంతరాళంబు ప్పి కాహళభేరి-
టహశంఖాదిశబ్దములు మొరయ,

1-235.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కలవిప్రజనులు గుణనిర్గుణరూప
ద్రభాషణములు లుకుచుండ,
భువనమోహనుండు పుండరీకాక్షుండు
పుణ్యరాశి హస్తిపురము వెడలె.

టీకా:

కనక = బంగారు; సౌధములన్ = మేడల; పైన్ = మీదనున్న; కౌరవ = కౌరవ వంశపు; కాంతలు = స్త్రీలు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కోరి = ఇష్టముతో; కురియన్ = కురిపించగ; మౌక్తిక = ముత్యాల; దామ = దండలు; సమంచిత = అలంకరింపబడిన; ధవళ = తెల్లని; అతపత్త్రంబు = గొడుగు; విజయుండు = అర్జునుడు; పట్టుచుండన్ = పట్టుతుండగ; ఉద్ధవ = ఉద్ధవుడు; సాత్యకులు = సాత్యకియు; ఉత్సాహవంతులు = ఉత్సాహముకలవారు; ఐ = అయ్యి; రత్న = రత్నములతో; భూషిత = అలంకరింపబడిన; చామరములు = చామరములు; వీవ = వీస్తుండగా; గగన = ఆకాశముయొక్క; అంతరాళంబున్ = లోపలంతా; కప్పి = నిండిన; కాహళ = బాకాలు; భేరి = భేరీవాద్యాలు; పటహ = పెద్దడోలు, రాండోలు; శంఖ = శంఖములు; ఆది = మొదలగువాని; శబ్దములు = శబ్దములు; మొరయ = చెలరేగు చుండగ;
సకల = సమస్త; విప్ర = బ్రాహ్మణ; జనులు = ప్రజలు; సగుణ = సగుణ; నిర్గుణ = నిర్గుణ; రూప = రూపములలో; భద్ర = శుభమైన; భాషణములు = సంభాషణలు; పలుకుచు = పలుకుతూ; ఉండ = ఉండగా; భువన = లోకమును; మోహనుండు = మోహింపజేయువాడు; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పద్మముల వంటి కన్నులవాడు, కృష్ణుడు}; పుణ్యరాశి = పుణ్యముల కుప్ప, కృష్ణుడు; హస్తిపురము = హస్తినాపురము నుండి; వెడలె = బయలుదేరెను.

భావము:

భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలా హస్తినాపుర వీథుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నందనందనునిపై పుష్ప వర్షాలు కురిపించారు. విజయుడు వెనుక నిలబడి ముత్యాలసరాలతో విరాజిల్లే శ్వేతచ్ఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటునిటు నడుస్తు రత్నఖచితాలైన పిడులు పట్టుకొని వింజామరలు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మ్రోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు పలుకుతున్నారు.