పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు

  •  
  •  
  •  

1-226-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు.

టీకా:

మునులు = మునులు; నృపులు = రాజులు; చూడ = చూస్తుండగ; మును = పూర్వము; ధర్మజుని = ధర్మరాజు యొక్క {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; సభా = సభదీర్చు; మందిరమున = భవనములో; యాగ = యజ్ఞముచేయు; మండపమునన్ = మండపములో; చిత్ర = చిత్రమైన; మహిమ = ప్రాభవము; తోడన్ = తో; చెలువొందు = అందాలొలికించు; జగత్ = విశ్వమునకు; ఆది = మూలపు; దేవుఁడు = దేవుడు; అమరున్ = కుదురుకొనుగాక; నాదు = నా యొక్క; దృష్టి = చూపుల; అందున్ = లోపల.

భావము:

మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు.