పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు

  •  
  •  
  •  

1-224-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహార్మంబు వొమ్మంచు న
ర్జుసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
నులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

టీకా:

తన = తన; కున్ = కు; భృత్యుఁడు = సేవకుడు; వీనిన్ = ఇతనిని; కాఁచుట = కాపాడుట; మహా = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; ఒమ్ము = పొమ్ము; అంచున్ = అనుచు; అర్జున = అర్జునుని; సారథ్యము = రథసారథ్యము; పూని = చేపట్టి; పగ్గములు = పగ్గములను; చేన్ = చేతితో; చోద్యంబుగాన్ = ఆశ్చర్యకరముగ; బట్టుచున్ = పట్టుకొని; మునికోలన్ = ములుగఱ్ఱను; వడిన్ = త్రిప్పు వేగమును; పూని = కూడి ఉండి; ఘోటకములన్ = గుఱ్ఱములను; మోదించి = సంతోషపరచి; తాడించుచున్ = అదలించుచు; జనులన్ = ప్రజలను; మోహము = మోహము; ఒందన్ = పొంద; చేయు = చేయుచున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహముగలవానిని; ప్రశంసించెదన్ = స్తోత్రము చేసెదను.

భావము:

ఇతడు అర్జునుడు నా సేవకుడు. ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు. అది పరమ ధర్మముట. అందుకని, అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు. పగ్గములను ఆశ్చర్యకరముగ పట్టుకొన్నాడు. మిక్కిలి ఉత్సాహంతో ములుగఱ్ఱ వేగముగా తిప్పుతూ, గుఱ్ఱములను మోదిస్తూ, తాడిస్తున్నాడు. చూసే ప్రజలను మోహింపజేస్తున్నాడు. చూడు అదిగో అట్టి ఆ శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తున్నాను.