పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-201-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!""

టీకా:

శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణుడు - 1. నల్లనివాడు, 2. భక్తుల హృదయములు ఆకర్షించువాడు, 3. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోణశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము, కృష్ణుడు, నల్లనివాడు, 4. కృఞకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, 5. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోణశ్చ నిర్వృతివాచకః, తయోరైక్యాత్పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును తెంచివేయువాడు, కృష్ణుడు, , సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు, విష్ణుసహస్రనామములలో 57వ నామం}; యదుభూషణా = కృష్ణా {యదుభూషణుడు - యదు వంశమునకు భూషణము వంటి వాడు, కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖుడు - అర్జునునకు సఖుడు, కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగారరత్నాకరుడు - శృంగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహనుడు - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వరుడు - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు}; దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణా = కృష్ణా {దేవతానీకగోబ్రాహ్మణార్తిహరణుడు - దేవత - దేవతల, అనీక - సేనలకును, బ్రాహ్మణ - బ్రాహ్మణులకును, గోగణ - గోవులమందకును, ఆర్తి - బాధలను, హరణా - హరించువాడు, కృష్ణుడు}; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణసంధాయికుడు - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరిస్తున్నాను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధి - శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు.}.

భావము:

శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.