పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-191-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నము, నైశ్వర్యంబును,
మును, విద్యయునుఁ, గల మచ్ఛన్ను లకిం
గోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా!

టీకా:

జననమున్ = పుట్టుటయు; ఐశ్వర్యంబును = సంపదయు; ధనమును = విత్తమును; విద్యయును = విద్యయును; కల = కలుగుటవలన; మదచ్ఛన్నులు = గర్వముతో కప్పబడినవారు; అకించన = విత్తహీనులకు; గోచరుఁడు = కనబడువాడు; అగు = అయినట్టి; నిన్నున్ = నిన్ను; వినుతింపఁగన్ = కీర్తించ; లేరు = లేరు; నిఖిలవిబుధస్తుత్యా = జ్ఞానులు అందరిచేత కీర్తింపబడేవాడా (కృష్ణా).

భావము:

నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించేవాడు, నిఖిల దేవతా సంస్తూయమానుడు అయిన నిన్ను, గొప్పవంశంలో జన్మించామనీ, భోగభాగ్యాలు ఉన్నాయినీ, ధనవంతులము అనీ, విద్యావంతులము అనీ మదాంధులైన మానవులు ప్రస్తుతింపలేరు.