పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-190-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ
ల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ
ల్లడంబునఁ జిక్కకుండఁగఁ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన, జగత్పతీ!
కౌరవులు

టీకా:

బల్లిదుండు = మిక్కిలి బలము గలవాడు; అగు = అయిన; కంసు = కంసుని; చేతను = చేత; బాధ = బాధలు; ఒందుచున్ = పొందుతూ; ఉన్న = ఉన్నట్టి; మీ = మీ; తల్లిన్ = తల్లిని; కాచిన = కాపాడిన; భంగిన్ = విధముగ; కాచితి = కాపాడితివి; ధార్తరాష్ట్రుల = కౌరవుల {ధార్తరాష్ట్రులు - ధృతరాష్ట్రుని కొడుకులు, కౌరవులు}; చేతన్ = చేత; ఏన్ = నేను; తల్లడంబునన్ = ఇబ్బందులలో; చిక్కకుండఁగన్ = చిక్కుకుపోకుండా; తావకీన = నీయొక్క; గుణ = గుణముల; వ్రజంబు = సమూహము; ఎల్లన్ = సమస్తమును; సంస్తుతి = చక్కగ కీర్తిన; చేసి = చేసి; చెప్పఁగన్ = చెప్పుటకు; ఎంతదానన్ = నేను ఎంతటి దానని; జగత్పతీ = కృష్ణా {జగత్పతి - లోకములకు ప్రభువు, కృష్ణుడు, విష్ణువు}.

భావము:

జగన్నాథా! బలవంతుడైన కంసునిబారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా, ధృతరాష్ట్రుని కొడుకులు అయిన కౌరవులు పెట్టిన ఇక్కట్లకు గురికాకుండా నన్ను కాపాడిన నీ అనంతకోటి గుణాలు అభివర్ణించటానికి నే నెంతదాన్ని.