పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-189-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయులతోడ నే హ్యమానంబగు-
తుగృహంబందునుఁ జావకుండఁ,
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల-
మారుతపుత్త్రుండు డియకుండ,
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ-
ద్రౌపదిమానంబు లఁగకుండ,
గాంగేయ కుంభజ ర్ణాది ఘనులచే-
నా బిడ్డ లనిలోన లఁగకుండ,

1-189.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరటుపుత్త్రిక కడుపులో వెలయు చూలు
ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ,
ఱియు రక్షించితివి పెక్కుమార్గములను,
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష!

టీకా:

తనయులు = పుత్రులు; తోడన్ = తో; నే = నేను; దహ్యమానంబు = మండిపోవుచున్నది; అగు = అయినట్టి; జతు = లక్క; గృహంబు = గృహము; అందును = లో; చావకుండన్ = చనిపోకుండా; కురురాజు = కురువంశ రాజు, దుర్యోధనుడు; వెట్టించు = పెట్టించిన; ఘోర = ఘోరమైన; విషంబులన్ = విషములవలన; మారుతపుత్త్రుండు = భీముడు {మారుతపుత్త్రుడు - వాయుదేవుని పుత్రుడు, భీముడు}; మడియకుండన్ = చనిపోకుండా; ధార్తరాష్ట్రుఁడు = దుశ్శాసనుడు {ధార్తరాష్ట్రుడు - ధృతరాష్ట్రుని కొడుకు, దుశ్శాసనుడు}; సముద్ధతిన్ = మిక్కిలి ఆటోపముతో {సముద్ధతిని - గురువు దగ్గర శిక్షింపబడని వానివలె, మిక్కిలి ఆటోపముతో}; చీరలు = చీరలు, బట్టలు; ఒలువంగన్ = ఒలిచేస్తున్నప్పుడు; ద్రౌపది = ద్రౌపది యొక్క; మానంబు = మానము; తలఁగకుండన్ = తొలగిపోగుండా; గాంగేయ = భీష్ముడు{గాంగేయుడు - గంగ యొక్క పుత్రుడు}, భీష్ముడు; కుంభజ = ద్రోణుడు {కుంభజుడు - కుంభములో పుట్టినవాడు, ద్రోణుడు}; కర్ణ = కర్ణుడు; ఆది = మొదలగు; ఘనులు = గొప్పవారి; చేన్ = చేత; నా = నా; బిడ్డలు = పిల్లలు; అని = యుద్ధము; లోనన్ = లో; నలఁగకుండన్ = నలిగికుండా;
విరటుపుత్త్రిక = ఉత్తర {విరటుపుత్త్రిక - విరటరాజు పుత్రిక, ఉత్తర}; కడుపు = కడుపు; లోన్ = లోపల; వెలయు = వెలసిన; చూలు = గర్భము; ద్రోణనందను = అశ్వత్థామ {ద్రోణనందనుడు - ద్రోణుని యొక్క కొడుకు, అశ్వత్థామ}; శర = బాణముల; వహ్నిన్ = అగ్నివలన; త్రుంగకుండన్ = తునికలు కాకుండగ; మఱియున్ = ఇంకను; రక్షించితివి = కాపాడావు; పెక్కు = అనేకమైన; మార్గములను = విధములుగ; నిన్నున్ = నిన్ను; ఏమని = ఏవిధంగా; వర్ణింతున్ = కీర్తించగలను; నీరజాక్ష = కృష్ణా {నీరజాక్షుడు - నీరజము (పద్మము) లవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు}.

భావము:

పుండరీకాక్షా! భగభగ మండుతున్న లక్కయింట్లో నా బిడ్డలు, నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు; దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు; దురహంకారంతో త్రుళ్లిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకొన్నావు; భీష్ముడూ మొదలైన యోధానుయోధాల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డు పడ్డావు; మళ్లీ ఇప్పుడు చిట్టితల్లి ఉత్తర కడుపులోని కసుగందును, అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోకుండా కనికరించావు; మరింకా ఎన్నో విధాలుగా నన్నూ, నా బిడ్డలనూ కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా!