పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామ గర్వ పరిహారంబు

  •  
  •  
  •  

1-173-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వస్తుత్యుఁడు, శక్రసూనుఁడు, మహావీరుండు ఘోరాసిచే
శ్వత్థామ శిరోజముల్దఱిఁగి, చూడాంతర్మహారత్నమున్
శ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని, పావ్రాతబంధంబులన్
విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగముం బాసిపోన్.

టీకా:

విశ్వ = లోకముచే; స్తుత్యుఁడు = స్తుతింప దగినవాడు; శక్రసూనుఁడు = అర్జునుడు {శక్రసూనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు}; మహా = గొప్ప; వీరుండు = వీరుడు; ఘోర = భయంకరమైన; అసి = పదునుకల కత్తి; చేన్ = తో; అశ్వత్థామ = అశ్వత్థామ; శిరోజముల్ = కేశములు; తఱిఁగి = తెగ్గోసి; చూడ = జుట్టు; అంతర = లోని; మహా = గొప్ప; రత్నమున్ = రత్నమును; శశ్వత్ = శాశ్వతమైన; కీర్తి = కీర్తి; వెలుంగన్ = ప్రకాశింపగా; పుచ్చుకొని = తీసికొని; పాశ = తాళ్ల; వ్రాత = సమూహము యొక్క; బంధంబులన్ = కట్లను; విశ్వాసంబునన్ = నమ్మకముగ; ఊడ్చి = విప్పి; త్రోచెన్ = నెట్టెను; శిబిర = గుడారముయొక్క; ఉర్వి = భూమి; భాగమున్ = భాగమును (ప్రదేశము); పాసి = తొలగి; పోన్ = పోవునట్లుగా.

భావము:

విశ్వమంతా కొనియాడ దగినవాడు, వీరాధివీరుడు, యింద్రపుత్రుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం పదునైన కత్తితో అశ్వత్థామ శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న మహామణిని వశం చేసుకున్నాడు. విశాలమైన కీర్తిని పొందాడు. తరువాత కట్టిన త్రాళ్లన్నీ విప్పదీసి శిబిరం బయటికి గెంటేశాడు.