పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట

  •  
  •  
  •  

1-172-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని సరసాలాపంబులాడి, పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి ”ద్రౌపదికి, నాకు, భీమసేనునకు సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు, నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు నారాయణానుమతంబున.

టీకా:

అని = అని; సరస = సరసములైన; ఆలాపంబులు = మాటలు; ఆడి = చెప్పి; పవననందనున్ = భీముని {పవననందనుడు - వాయుదేవుని పుత్రుడు, భీముడు}; ఒడంబఱచి = ఒప్పించి; అర్జునున్ = అర్జుడిని; చూచి = చూసి; ద్రౌపది = ద్రౌపది; కిన్ = కిని; నాకు = నాకును; భీమసేనుడు = భీముడు; కున్ = కి; సమ్మతంబుగ = అంగీకారం అయ్యేటట్లుగా; మున్ను = ఇంతకుముందు; నీ = నీవు; చేసిన = చేసినట్టి; ప్రతిజ్ఞయు = ప్రతిజ్ఞకూడా; సిద్ధించున్ = నెరవేరే; అట్లు = విధంగా; నా = నా; పంపు = ఆజ్ఞ ప్రకారము; సేయుము = చెయ్యి; అని = అని; నారాయణుండు = కృష్ణుడు; ఆనతి = ఆదేశము; ఇచ్చిన = ఇవ్వగా; అర్జునుండు = అర్జునుడు; నారాయణ = కృష్ణుని; అనుమతంబున = సమ్మతితో.

భావము:

ఈ విధంగా చతురోక్తులతో, భీముడిని చల్లపరచి, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి చూసి ”అర్జునా! ద్రౌపదికి, నాకు, భీముడికి సమ్మతమయ్యేలాగా, నీ ప్రతిజ్ఞ నెరవేరేలాగా ఈ విధంగా చెయ్యి.” అని కర్తవ్యం సూచించాడు; అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా. .