పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట

  •  
  •  
  •  

1-170-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన, నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె; భీముని సంరంభంబు సూచి, హరి చతుర్భుజుం డయి, రెండు చేతుల భీముని వారించి, కడమ రెంటను ద్రుపద పుత్రికను దలంగించి, నగుచు భీముని కిట్లనియె

టీకా:

అని = అని; పలికినన్ = పలుకగా; అశ్వత్థామ = అశ్వత్థామ; కున్ = కి; ద్రౌపది = ద్రౌపది; అడ్డంబు = అడ్డం; వచ్చె = వచ్చింది; భీముని = భీముని యొక్క; సంరంభంబు = వేగిరిపాటు; సూచి = చూసి; హరి = కృష్ణుడు; చతుర్ = నాలుగు; భుజుండు = భుజములుగలవాడు; అయి = అయి; రెండు = రెండు; చేతుల = చేతులతో; భీముని = భీముడిని; వారించి = ఆపి; కడమ = మిగిలిన; రెంటను = రెండింటితోను; ద్రుపదపుత్త్రికనున్ = ద్రౌపదిని; తలంగించి = తప్పించి; నగుచు = నవ్వుతూ; భీముని = భీముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధంగా; అనియె = చెప్పాడు.

భావము:

భీముడు అన్నంత పనీ చేస్తాడనే భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ ప్రక్క రెండు చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రక్క రెండు చేతులతో పాంచాలిని ప్రక్కకు తప్పిస్తూ భీమునితో నవ్వుతూ ఇలా చెప్పాడు.