పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట

  •  
  •  
  •  

1-160-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లర్జునుండు దెచ్చి చూపిన, బాలవధ జనిత లజ్జా పరాఙ్ముఖుం డైన కృపి కొడుకుం జూచి మ్రొక్కి, సుస్వభావ యగు ద్రౌపది యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; అర్జునుండు = అర్జునుడు; తెచ్చి = తీసుకొని వచ్చి; చూపిన = చూపించగా; బాల = పిల్లలను; వధ = సంహరించుటచే; జనిత = పుట్టిన; లజ్జా = సిగ్గుచే; పరాన్ = పెడ; ముఖుండు = ముఖము వాడు; ఐన = అయినట్టి; కృపి = కృపి {కృపి - కృపాచార్యుని చెల్లెలు, ద్రోణుని భార్య, అశ్వత్థామ తల్లి}; కొడుకున్ = కొడుకుని; చూచి = చూసి; మ్రొక్కి = నమస్కరించి; సు = మంచి; స్వభావ = స్వభావముగలది; అగు = అయినట్టి; ద్రౌపది = ద్రౌపది; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

చిన్న పిల్లల ప్రాణాలు తీసిన తన నీచత్వానికి సిగ్గుతో అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తలేకపోయాడు. సుగుణవతి అయిన ద్రౌపది పరాజ్ముఖుడైన అశ్వత్థామను చూసి, నమస్కరించి, ఇలా అన్నది