పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ద్రౌపది పుత్రశోకం

  •  
  •  
  •  

1-157-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ, గరుణాసంగంబు సాలించి య
న్యప్రాణంబులచేత రక్షణము సేయన్ వాఁ, డధోలోక దుః
ప్రాప్తుండగురాజదండమున సత్కల్యాణుఁ డౌ, నైన నీ
విప్రున్ దండితుఁ జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండఁగన్?""

టీకా:

స్వ = తనయొక్క; ప్రాణంబులన్ = ప్రాణములకొరకు; ఎవ్వఁడేనిన్ = ఎవడైనా; కరుణ = దయయొక్క; సంగంబు = స్పర్శ; చాలించి = విడిచిపెట్టి; అన్య = ఇతరులను; ప్రాణంబుల = ప్రాణముల; చేతన్ = వలన; రక్షణము = కాపాడుట; సేయన్ = చేయని; వాఁడు = వాడు; అధః = క్రింది, నరక; లోక = లోకములలోని; దుఃఖ = దుఃఖములను; ప్రాప్తుండు = పొందువాడు; అగున్ = అగును; రాజ = రాజుయొక్క; దండమున = శిక్షవలన; సత్ = మంచి; కల్యాణుఁడు = శుభమైన మార్గము పట్టినవాడు; ఔను = అగును; ఐనన్ = ఐన; ఈ = ఈ; విప్రున్ = బ్రాహ్మణుని; దండితున్ = దండింపబడినవానిని; చేయన్ = చేయుట; ఏటి = ఎందుల; కిన్ = కు; మహా = మిక్కిలి; విభ్రాంతి = విభ్రాంతి; చేన్ = లో; ఉండఁగన్ = ఉండగా.

భావము:

ఎవడైతే కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో, అటువంటి దుర్మార్గుడు నరకలోకంలో నానా దుఃఖాలూ అనుభవిస్తాడు; అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి, వాడికి శ్రేయస్సు లభిస్తుంది; కాని ఈ అశ్వత్థామ భయభ్రాంతుడై యున్నాడు గదా, కఠినంగా శిక్షించకు.”