పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ద్రౌపది పుత్రశోకం

  •  
  •  
  •  

1-152-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నర్జునుండు జలంబుల వార్చి, హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం డేసిన బ్రహ్మాస్త్రంబు మీదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన.

టీకా:

అనినన్ = అని ఆదేశించిన; అర్జునుండు = అర్జునుడు; జలంబులవార్చి = సంకల్పించుకొని; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబు = ప్రదక్షిణ; వచ్చి = చేసి; ద్రోణనందనుండు = ద్రోణుని కుమారుడు అశ్వత్థామ; ఏసిన = వేసినట్టి; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్త్రము; మీదన్ = పైన; తన = తన యొక్క; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమును; ప్రయోగించిన = ప్రయోగించగా.

భావము:

వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమనం చేసి, కృష్ణునికి ప్రదక్షిణం చేసి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్ర్తం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.