పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ద్రౌపది పుత్రశోకం

  •  
  •  
  •  

1-145-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యి ట్లొడంబఱచి, తనకు మిత్రుండును, సారథియు నైన హరి మేలనుచుండం, గవచంబు దొడిగి, గాండీవంబు ధరియించి, కపిధ్వజుండై, గురుసుతుని వెంట రథంబు దోలించిన.

టీకా:

అని = పలికి; ఇట్లు = ఈ విధముగ; ఒడన్ = ఒప్పునట్లు; పఱచి = చేసి; తన = తన; కున్ = కు; మిత్త్రుండును = స్నేహితుడును; సారథియును = సారథియు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; మేలు = మంచిది; అనుచున్ = అని పలుకుచూ; ఉండన్ = ఉండగ; కవచంబు = కవచమును; తొడిగి = ధరించి; గాండీవంబు = గాండీవమును; ధరియించి = తీసుకొని; కపి = ఆంజనేయుని గుర్తు; ధ్వజుండు = జండాపై ధరించినవాడు (అర్జునుడు); ఐ = అయి; గురుసుతుని = అశ్వత్థామ {గురుసుతుడు - గురువు (ద్రోణాచార్యుని), సుతుడు (పుత్రుడు), అశ్వత్థామ}; వెంట = వెనుక తరిమి; రథంబు = రథమును; తోలించినన్ = నడిపించగ.

భావము:

ఇలా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు "మేలుమే"లని ప్రశంసిస్తుండగా, అర్జునుడు కవచాన్ని ధరించి గాండీవాన్ని చేతబట్టి, కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథియై నారాయణుడు ముందుకు నడుపుతూ ఉండగా అశ్వత్థామను వెంట తరుముతూ వెళ్ళాడు.