పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ద్రౌపది పుత్రశోకం

  •  
  •  
  •  

1-143-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలుర చావు కర్ణములఁ డ్డఁ గలంగి, యలంగి, యోరువం
జాక, బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం
చాతనూజ నేలఁబడి జాలిఁ బడం గని, యెత్తి, మంజువా
చాతఁ జూపుచుం, జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనున్.

టీకా:

బాలుర = కొడుకుల; చావు = మృతి; కర్ణములన్ = చెవులలో; పడ్డన్ = పడగా; కలంగి = కలతచెంది; అలంగి = శోకించి; ఓరువన్ = ఓర్చుకొన; చాలక = లేక; బాష్ప = కన్నీటి; తోయ = నీటి; కణ = బిందువుల; జాలము = సమూహము; చెక్కుల = చెంపల వెంట; రాలన్ = రాలునట్లుగ; ఏడ్చి = దుఃఖించి; పాంచాల = పాంచాల రాజు యొక్క; తనూజ = కూతురు; నేలన్ = నేలపై; పడి = పడినదై; జాలిన్ = బాధ; పడన్ = పడుతుండగ; కని = చూచి; ఎత్తి = పైకిలేపి; మంజు = మృదువైన; వాచాలతన్ = మాటల చాతుర్యము; చూపుచున్ = ప్రదర్శిస్తూ; చికురజాలమున్ = ముంగురుల సమూహము; దువ్వుచున్ = దువ్వుతూ; క్రీడి = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అన్నాడు.

భావము:

కన్న కొడుకులంతా, అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయారని విని ద్రౌపది దుఃఖాన్ని సహించలేకపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టేలా ఏడ్చి జాలితో క్రింద పడి దొర్లుతున్న ద్రౌపదిని అర్జునుడు చూసాడు. ఆమెను ఓదార్చి, మధురమైన మాటలతో ధైర్యం చెప్పుతూ ఆమె ముంగురులు దువ్వుతూ ఇలా అన్నాడు-