పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-140-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిగుణవర్ణన రతుఁడై
రితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్పతంబఠించెఁ ద్రిజగ
ద్వమంగళమైన భాగత నిగమంబున్.

టీకా:

హరి = హరియొక్క; గుణ = గుణముల; వర్ణన = వర్ణన యందు; రతుఁడు = ఆసక్తి గలవాడు; ఐ = అయి; హరి = హరి యందు; తత్పరుఁడు = నిష్ఠగలవాడు {హరితత్పరుడు - తను కానిది హరి మాత్రమే అని నడచువాడు}; ఐన = అయినట్టి; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బదరీవనమున ఉండువాడు బాదరాయణుడు (వ్యాసమహర్షి) వారి పుత్రుడు బాదరాయణి (శుకమహర్షి)}; శుభ = శుభమునందు; తత్పరతన్ = నిష్ఠతో; పఠించెన్ = చదివెను; త్రి = మూడు; జగత్ = లోకములకు; వర = శ్రేష్ఠమైన; మంగళము = శుభము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము అనే; నిగమంబున్ = వేదమును.

భావము:

శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు.