పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-138-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె"నని చెప్పిన విని శౌనకుండు ”నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె?"ననవుడు; సూతుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భాగవతంబు = భాగవతమును; నిర్మించి = రచించి; మోక్ష = మోక్షమును; అర్థి = అర్థించువాడు; ఐన = అయినట్టి; శుకుని = శుకుని; చేన్ = చేత; చదివించెన్ = చదివించెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; విని = విని; శౌనకుండు = శౌనకుడు; నిర్వాణ = మోక్షమునందు; తత్పరుండును = నిష్ఠగలవాడును; సర్వ = సర్వము అందు; ఉపేక్షకుండును = ఉదాసీనత కలవాడును; ఐన = అయినట్టి; శుక = శుకుడు అను; యోగి = యోగి; ఏమిటి = ఎందు; కిన్ = కొరకు; భాగవతంబు = భాగవతమును; అభ్యసించెన్ = అధ్యయనము చేసాడు; అనవుడు = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.

భావము:

ఈ విధంగా మహాభాగవత మనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే చదివించాడు” అని సూతుడు చెప్పగానే శౌనకముని విని ”మోక్ష మందు మాత్రమే అపేక్ష కలిగి, సమస్త మందు ఉపేక్ష కల శుకయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేసాడు” అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా అన్నాడు-