పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-127-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాలని కోర్కి యూరక
పోదు, విడిపించు దోషపుంజములను, మ
త్సేవం బుట్టును వైళమ
భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే.

టీకా:

నావలని = నామీద; కోర్కి = భక్తి; ఊరక = ఊరికే; పోవదు = పోదు; విడిపించున్ = విడిపించును; దోష = పాపపు; పుంజములను = సమూహములను; మత్ = నాయొక్క; సేవన్ = సేవవలన; పుట్టును = కలుగును; వైళమ = శ్రీఘ్రముగ; భావింపఁగ = ఎంచిచూస్తే; నాదు = నాయొక్క; భక్తి = భక్తి; బాలక = కుమారా; వింటే = వింటున్నావా.

భావము:

వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది.