పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-124-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందాశ్రులు గన్నులన్ వెడల, రోమాంచంబుతోఁ, దత్పద
ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో ద్దేవుఁడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్,
నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్.

టీకా:

ఆనందాశ్రులు = ఆనందబాష్పములు; కన్నులన్ = కళ్లవెంట; వెడల = కారగ; రోమాంచంబు = వెంట్రుకల గగుర్పాటు; తోన్ = తో; తత్ = వాని; పద = పాదముల; ధ్యాన = ధ్యానములో; ఆరూఢుఁడన్ = మునిగినవాడను; ఐన = అయిన; నా = నా; తలఁపు = భావము; లోన్ = లో; ఆ = ఆ; దేవుఁడున్ = దేవుడు; తోఁచెన్ = తోచెను; నేన్ = నేను; ఆనంద = సంతోష; అబ్ధి = సాగరములో; గతుండన్ = మునిగినవాడను; ఐ = అయి; ఎఱుఁగ = తెలిసికొన; లేనైతిన్ = లేకపోతిని; ననున్ = నన్నూ; ఈశ్వరున్ = ఈశ్వరుని; నానా = సమస్త; శోక = శోకములను; అహము = పోగొట్టునది; ఐన = అయినట్టి; ఆ = ఆ; తనువున్ = రూపమును; కానన్ = చూడ, కనుగొన; లేక = లేక; అట్లు = ఆవిధముగ; అంతటన్ = అప్పుడు.

భావము:

నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.