పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-114-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో
యిన, బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్
నె? నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ? ద
త్తనువుం బాసిన చందమెట్లు? చెపుమా దాసీసుతత్వంబుతోన్.""

టీకా:

వినుము = వినుము; ఆ = ఆ; భిక్షులు = యోగులు; నీకున్ = నీకు; ఇట్లు = ఈ విధముగ; కరుణన్ = దయతో; విజ్ఞానమున్ = విజ్ఞానమును; చెప్పి = తెలిపి; పోయిన = వెళ్ళిపోయిన; బాల్యంబున = బాల్యములో; వృద్ధ = పెద్దవాడు, జ్ఞాని; భావమున = అయినప్పుడు; నీకు = నీకు; ఏ = ఏ; రీతి = విధమైన; సంచారముల్ = సంచరించుటలు; చనెన్ = జరిగెను; నీకు = నీకు; ఇప్పుడు = ఇప్పుడు; పూర్వ = పూర్వ; కల్ప = జన్మ; మతి = జ్ఞాపకములు; ఏ = ఏ; జాడన్ = మార్గమున; ప్రదీపించెన్ = ప్రకాశించెను; తత్ = ఆ; తనువున్ = శరీరమును; పాసిన = విడిచిన; చందము = విధము; ఎట్లు = ఏది; చెపుమా = చెప్పుము; దాసీ = దాసీ; సుతత్వంబు = పుత్రతత్వము; తోన్ = తో.

భావము:

“ఆయ్యా! నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్లిపోయారు గదా. అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది. పెద్దవాడ వయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు. ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వ జన్మస్మృతి ఏ విధంగా కలిగింది. దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు.”