పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-112-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునికులములోన మిక్కిలి
వినుకులు గలవాఁడ వీవు, విభుకీర్తులు నీ
నుదినముఁ బొగడ వినియెడి
ములకున్ దుఃఖమెల్ల శాంతిం బొందున్.""

టీకా:

ముని = మునుల; కులము = వంశము; లోనన్ = లో; మిక్కిలి = ఎక్కువగ; వినుకులు = (అనేక విషయములను) వినుటలు; కలవాఁడవు = కలిగిన; వాఁడవు = వాడవు; ఈవు = నీవు; విభు = ప్రభు యొక్క, భగవంతుని; కీర్తులు = కీర్తనలు; నీవు = నీవు; అనుదినమున్ = ప్రతిదినమును; పొగడ = కీర్తించుచుండగ; వినియెడి = వినెడు; జనముల = మానవులు; కున్ = కు; దుఃఖము = దుఃఖము; ఎల్లన్ = సమస్తము; శాంతిన్ = శాంతిని; పొందున్ = పొందును.

భావము:

వ్యాసా! నీవు మునులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతనాలకు శాంతి లభించేటట్లు, చక్కగా వాసుదేవుని కీర్తించుము.“