పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-109-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చారంబులు లేక, నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై,
లత్వంబును మాని, నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని
ష్కటత్వంబున, దీనవత్సలతతోఁ, గారుణ్య సంయుక్తులై
యుదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్.

టీకా:

అపచారంబులు = తప్పులు, పొరపాట్లు; లేక = లేకుండ; నిత్య = ప్రతిదినము; పరిచర్యా = ఉపచారములు; భక్తి = భక్తి; ఉక్తుండను = కూడినవాడను; ఐ = అయి; చపలత్వంబును = చపలతను; మాని = మానివేసి; నేన్ = నేను; కొలువఁగా = ఆరాధించగా; సంప్రీతులు = సంతోషించినవారు; ఐ = అయి; వారు = వారు; నిష్కపటత్వంబునన్ = కపటత్వము లేకుండగను; దీన = దీనుల యెడ చూపెడి; వత్సలత = వాత్సల్యము; తోన్ = తో; కారుణ్య = దయ; సంయుక్తులు = తో కూడినవారు; ఐ = అయి; ఉపదేశించిరి = ఉపదేశించిరి; నాకున్ = నాకు; ఈశ్వర = హరియొక్క; రహస్య = రహస్యమైన; ఉదార = చక్కటి; విజ్ఞానమున్ = విజ్ఞానమును.

భావము:

ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించి నందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతు లైనారు. ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు.