పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-107-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారల్ కృష్ణు చరిత్రముల్ చదువఁగా, ర్ణింపఁగాఁ, బాడఁగా,
నా రావంబు సుధారసప్రతిమమై శ్రాంతమున్ వీనులం
దోరంబై పరిపూర్ణమైన, మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై.

టీకా:

వారల్ = వారు; కృష్ణు = కృష్ణుని; చరిత్రముల్ = చరితములు; చదువఁగా = చదువుచుండగా; వర్ణింపఁగాన్ = వర్ణిస్తుండగా; పాడఁగాన్ = పాడుతుండగా; ఆ = ఆ; రావంబు = శబ్దము, రాగము; సుధా = అమృతపు; రస = రుచితో; ప్రతిమము = సాటిది; ఐ = అయి; అశ్రాంతమున్ = ఎడతెగక; వీనులన్ = చెవులలో; దోరంబు = బలిష్ఠము , అధికము; ఐ = అయి; పరిపూర్ణమైన = నిండిపోవ; మది = మనసున; సంతోషించి = సంతోషించి; నేను = నేను; అంతటన్ = అప్పుటినుండి; ప్రారంభించితిన్ = సంకల్పించితిని; విష్ణు = హరియొక్క; సేవ = భక్తి; కిన్ = కి; ఇతర = ఇతరమైన; ప్రారంభ = సంకల్పాలకి; దూరుండను = దూరమైనవానిని; ఐ = అయి.

భావము:

ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తు హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత రసప్రవాహాలై నా వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయా లన్నింటికి స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను.